సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా ఉన్న చిరంజీవి వెంకటేష్ చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్.దాదాపు 35 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య మంచి సానిహిత్యం ఉంది.
చిరంజీవి మాస్ హీరో గా ఒక స్థాయి లో ఉన్నపుడు వెంకటేష్ క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకున్నాడు.ఇక చిరంజీవి మాస్ సినిమాలకి పెట్టింది పేరు ఎందుకంటే అప్పట్లో ఆయన ఏ సినిమా చేసిన అది రికార్డ్స్ క్రియేట్ చేసివి…
ఒకానొక టైం లో వరుసగా మాస్ సినిమాలు చేయడం తో చిరంజీవి కి అవి రొటీన్ అనిపించాయి అప్పుడు అల్లు అరవింద్ చెప్పిన సలహా ప్రకారం వెంకటేష్ లా చిరంజీవి కూడా ఒక ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకొని భూపతి రాజా గారి కథ తీసుకొని సత్యానంద్ గారితో డైలాగ్స్ రాయించుకొని సురేష్ కృష్ణ గారి డైరెక్షన్ లో చిరంజీవి చేసిన ఫ్యామిలీ సినిమా డాడీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు…

దాంతో చిరంజీవి తన సన్నిహితుల దగ్గర ఏ హీరో ఎవి చేస్తే ఆడియెన్స్ చూస్తారో అవే చేయాలి మనకు ఈ ఫ్యామిలీ సినిమాలు సెట్ అవ్వవు వీటికి వెంకటేష్ మాత్రమే కరెక్ట్ అని చెప్పాడట.అయితే ఈ సినిమా చూసిన వెంకటేష్ చిరంజీవి కి ఫోన్ చేసి బాగా చేశారు అని చెబితే అప్పుడు చిరంజీవి ఇలాంటి సినిమాలు నాకంటే నువ్వూ చేస్తేనే కరేక్ట్ వెంకీ ఇవి నీకే బాగా సెట్ అవుతాయి ఈ సినిమాలకు నువ్వూ అయితేనే బాగా న్యాయం చేయగలవు అని చెప్పారట.చిరంజీవి అన్నట్టు గా ఫ్యామిలీ సినిమాకి వెంకటేష్ మాత్రమే పెర్ఫెక్ట్ గా సరిపోతారు…

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి హిట్ సిరీస్ లకి డైరెక్షన్ చేసిన శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.ఇక చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.
ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు చిరంజీవి…
.







