బాహుబలి సినిమా ఇండియా వైజ్ ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం అందరికి తెలిసిందే.ముఖ్యం గా ఈ సినిమాతోనే పాన్ ఇండియా సినిమాలు రావడం స్టార్ట్ అయ్యాయి సౌత్ సినిమాలు నార్త్ సినిమాలకంటే ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మొదటి సినిమా ఇదే…అలాగే ఈ సినిమాతో ప్రభాస్ ఇండియా లోనే టాప్ హీరో గా ఎదిగాడు.రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ సినిమా లో బాహుబలి పాత్ర తర్వాత చాలా ముఖ్యమైన పాత్రల్లో కట్టప్ప పాత్ర ఒకటి…
బాహుబలి పక్కనే ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ మొదటి పార్ట్ కి ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు అయితే రెండో పార్ట్ లో కట్టప్పా క్యారెక్టర్ చాలా కీలకమైంది ఈ సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి

మలయాళ సూపర్ స్టార్ అయిన మమ్ముట్టిని అడిగినట్టు తెలుస్తుంది కానీ ఆ క్యారెక్టర్ నచ్చక మోహన్ లాల్ దాన్ని రిజక్ట్ చేశాడని తెలుస్తుంది…కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ పాత్ర కి చాలా పేరు వచ్చింది దానితో మోహన్ లాల్ ఈ పాత్ర చేస్తే ఇంకా హైలెట్ గా ఉండేది అని ఆయన కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలిసింది…

ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఏ చిన్న అవకాశం వచ్చిన చేసే ఉదేశ్యం లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నట్టు తెలుస్తుంది.ఒకసారి ఆయన సినిమాలో నటిస్తే ఒక పది సంవత్సరాల వరకు వాళ్ళు ఇండస్ట్రీలో డోకా లేకుండా గడుస్తుంది.అందుకని అందరూ రాజమౌళి తో ఒక్క సినిమా అయిన చేయాలి అని చూస్తున్నారు…
.







