హానీ రోజ్. నిన్న మొన్నటి వరకు చాలామందికి ఈమె ఎవరు అన్నది తెలియదు.
కానీ తాజాగా బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీ రోజ్.ఈ సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె పేరు కొద్దిరోజుల పాటు మారు మోగిపోయింది.
ఇక ఈమె అందానికి యువత ఫిదా అయిపోయారు.వీర సింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా అభిమానులను సొంతం చేసుకుంది.
వీర సింహారెడ్డి సినిమా తర్వాత అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది అని హనీ రోజ్.ఇంకా చెప్పాలంటే.వీరసింహారెడ్డి సినిమా ద్వారా శృతి హాసన్ కంటే హనీ రోజ్‌కే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పవచ్చు.కాగా ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అన్న దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఉదాహరణ అని చెప్పవచ్చు.

కేరళ మన్నార్‌కడ్‌లో మైజీ ఫ్యూచర్ అనే షాప్ ఓపెన్ చేసేందుకు అతిథిగా వెళ్లింది హనీరోజ్. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల ఊర్లు కాదు ఏకంగా జిల్లాల నుంచే అభిమానులు భారీగా తరలి వచ్చారు.అక్కడికి వచ్చిన జనాన్ని చూసి నిర్వాహకులు స్టన్ అయ్యారు.

వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లు, పోలీసులు ఆపసోపాలు పడ్డారు.అతి కష్టం మీద షాపు ఓపెన్ చేసి తిరిగి రిటన్ అవుతుండగా ఫ్యాన్స్ ఆమెపై ఎగబడ్డారు.ఫొటోలు, సెల్ఫీలు కోసం తెగ ఆరాటపడ్డారు.
హనీ రోజ్ కారెక్కే సమయానికి కొంతమంది ఆమెపై మీద పడిపోయారు.అయినప్పటికీ ఆమె అసహనం ప్రదర్శించలేదు.
చిరు నవ్వుతో బాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియోను హనీ రోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అది కాస్త ట్రెండ్ అవుతోంది.







