1.ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు : సీపీఐ
ఏపీలో అందరి ఫోన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే చెబుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
2.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 9వ రోజుకు చేరుకుంది.
3.డీజీపీ కి వర్ల రామయ్య లేఖ
బంగారుపాలెం చోటు చేసుకున్న పరిణామాలపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య రాష్ట్ర డిజిపి కి లేఖ రాశారు .పోలీసులపై చర్య తీసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
4.నారా లోకేష్ పై కేసు నమోదు
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ తో సహా ఆరుగురుపై కేసు నమోదు అయింది.
5.బీ ఆర్ ఎస్ పై షర్మిల ఆగ్రహం
టిఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
6.రెండో రోజు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
8.యూపీ ,హర్యానాలలో భూ ప్రకంపనలు
ఉత్తరప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.2 గా నమోదయింది.
9.కేటీఆర్ తో జర్మనీ పార్లమెంట్ సభ్యుల భేటీ
జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.
10.పొత్తులపై సోమ వీర్రాజు కామెంట్స్
కుదిరితే జనసేనతోనే పొత్తు లేకపోతే జనంతోనే పొత్తు పెట్టుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
11.గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ
శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు.
12.వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కామెంట్స్
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందు పార్టీపై విమర్శలు చేశారు.వైసీపీలో కొనసాగడం ఇష్టం లేక మౌనంగా నిష్క్రమిద్దామని అనుకున్నా, నా వ్యక్తిత్వాన్ని శంకించే లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
13.రెవెన్యూ శాఖలో మరిన్ని సంస్కరణలు
విశాఖ వేదికగా ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది.మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి తెలిపారు.
14.భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్
ఈరోజు నంద్యాలలో బహిరంగ చర్చకు సవాల్ చేసిన భూమా అఖిలప్రియ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
15.క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఏపీలో క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
16.క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ
తిరుపతిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా స్విమ్స్ లో ఎంబిబిఎస్ నర్సింగ్ ఫిజియోథెరపీ విద్యార్థుల చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
17.జ్యోతుల మహోత్సవం
నంద్యాలలో నేడు నందికొట్కూరు లోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జ్యోతుల మహోత్సవం జరగనుంది.
18.విశాఖలో జాతీయ సదస్సు
నేటి నుంచి రెండు రోజులపాటు విశాఖలో జాతీయ సదస్సు జరగనుంది.జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
19.తిరుమలలో గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు పౌర్ణమి గరుడ సేవ జరగనుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 57,160
.