సీఎం జగన్ ముందస్తుకు వెళ్తారా..?

ఏపీలో మెల్లిమెల్లిగా నేతలు చేజారి పోతుండటంతో.అధికార పార్టీలో గుబులు మొదలయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

 Cm Ys Jagan Planning For Early Elections In Ap,tdp, Chandrababu Naidu, Nara Loke-TeluguStop.com

సీఎం జగన్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం నమ్మడం లేదని దుమ్మెత్తి పోస్తున్నారు.ఫోన్ ట్యాపింగులు చేస్తూ.

అప్రతిష్టపాలు అవుతున్నారని మండిపడుతున్నారు.అయితే సీఎం జగన్ ప్రతిపక్షాల విమర్శలను పట్టించకోకుండా తనపని తాను చూసుకుంటు పోతున్నారు.

వైఎస్సార్సీపీ పార్టీ పెట్టిన దగ్గరి నుంచి.పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూ.

పోయే వారిని పోనిచ్చారు.

Telugu Butta Renuka, Chandrababu, Kurnool, Lokesh, Ycp Mlas-Politics

2014 ఎన్నికల్లో తన పార్టీ తరపున గెలిచి.టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు జంప్ అయినా పట్టించుకోలేదు.కర్నూలు నుంచి బుట్టా రేణుక అలా టీడీపీలోకి వెళ్ళి భంగపాటుకు గురి అయినా పట్టించుకోకుండా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు.

ఈ సారి మాత్రం ఎలాగైనా ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించాలని ఫిక్స్ అయ్యారు.ఇప్పుడు రాష్ట్రంలో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు దాదాపు జగన్ మేనియాపైనే గెలిచిన నేతలు.

జగన్ కూడా తనపైన తనకు నమ్మకం ఉండటంతో.పార్టీ మారుతున్న నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu Butta Renuka, Chandrababu, Kurnool, Lokesh, Ycp Mlas-Politics

రాష్ట్రంలోని 175 స్థానాలను గెలవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా జగన్ వెనుకాడటం లేదని టాక్ నడుస్తోంది.అందులో భాగంగా జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే పార్టీలో ఏరివేతలు మొదలు అయ్యాయని.పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకుని.అప్పుడు ముందస్తు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే పార్టీలో కీలక నేతలు అయినా.

సరే అసమ్మతి తీసుకు వస్తారు అంటే చాలు పక్కన పెడుతున్నారు.సీఎం జగన్ అనుకున్న టైం లోపు అన్నీ సెట్ అయితే.

తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube