సీఎం జగన్ ముందస్తుకు వెళ్తారా..?
TeluguStop.com
ఏపీలో మెల్లిమెల్లిగా నేతలు చేజారి పోతుండటంతో.అధికార పార్టీలో గుబులు మొదలయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
సీఎం జగన్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం నమ్మడం లేదని దుమ్మెత్తి పోస్తున్నారు.
ఫోన్ ట్యాపింగులు చేస్తూ.అప్రతిష్టపాలు అవుతున్నారని మండిపడుతున్నారు.
అయితే సీఎం జగన్ ప్రతిపక్షాల విమర్శలను పట్టించకోకుండా తనపని తాను చూసుకుంటు పోతున్నారు.
వైఎస్సార్సీపీ పార్టీ పెట్టిన దగ్గరి నుంచి.పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూ.
పోయే వారిని పోనిచ్చారు. """/"/
2014 ఎన్నికల్లో తన పార్టీ తరపున గెలిచి.
టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు జంప్ అయినా పట్టించుకోలేదు.కర్నూలు నుంచి బుట్టా రేణుక అలా టీడీపీలోకి వెళ్ళి భంగపాటుకు గురి అయినా పట్టించుకోకుండా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు.
ఈ సారి మాత్రం ఎలాగైనా ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించాలని ఫిక్స్ అయ్యారు.
ఇప్పుడు రాష్ట్రంలో గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు దాదాపు జగన్ మేనియాపైనే గెలిచిన నేతలు.
జగన్ కూడా తనపైన తనకు నమ్మకం ఉండటంతో.పార్టీ మారుతున్న నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
"""/"/
రాష్ట్రంలోని 175 స్థానాలను గెలవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా జగన్ వెనుకాడటం లేదని టాక్ నడుస్తోంది.
అందులో భాగంగా జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే పార్టీలో ఏరివేతలు మొదలు అయ్యాయని.
పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకుని.అప్పుడు ముందస్తు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే పార్టీలో కీలక నేతలు అయినా.సరే అసమ్మతి తీసుకు వస్తారు అంటే చాలు పక్కన పెడుతున్నారు.
సీఎం జగన్ అనుకున్న టైం లోపు అన్నీ సెట్ అయితే.తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!