కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బాగుందన్నారు.
అన్ని రాష్ట్రాలు రాజకీయాలను పక్కనబెట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలని తెలిపారు.
ట్యాక్స్ మినహాయింపులు సగటు వ్యక్తులకు లాభదాయకమని మంత్రి బుగ్గన వ్యాఖ్యనించారు.
వ్యవసాయం, పౌర సరఫరాలకు బడ్జెట్ లో కేటాయింపులు తగ్గాయన్నారు.అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న వాటా తగ్గిందని పేర్కొన్న మంత్రి బుగ్గన ఈ ఏడాది ఇంకా తగ్గి 31.25 శాతంగా ఉందని వెల్లడించారు.







