కలయుగ పాండవులు సినిమాలో వెంకటేష్ సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
కుష్బూకు అభిమానులు ఆమెకు ఏకంగా గుడి కట్టి మరీ వారి అభిమానాన్ని చాటుకున్నారు.ఇంతలా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఖుష్బూ ప్రస్తుతం సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా రాజకీయాలలో కూడా రాణిస్తోంది.
అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది.ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కుష్బూ వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరిన కుష్బూ తాజాగా మరొకసారి అనారోగ్యం పాలయ్యింది.ఇటీవల తన కాలుకి గాయం అయ్యింది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

గాయం అయినా తన ప్రయాణం ఆగదని ఖుష్బు అన్నట్లుగానే.తాజాగా మంగళవారం రోజున వేరే రాష్ట్రానికి వెళ్లడం కోసం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.అయితే విమానాశ్రయంలో కుష్బూకు ఒక చేదు అనుభవం ఎదురయింది.తాజాగా ఆ విషయం గురించి ఖుష్బూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కాలికి ఉన్న గాయంతోనే మంగళవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు కుష్బూ.ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ.”కాలికి గాయం అవటంతో నడవలేక వీల్ చైర్ కావాలని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని కోరాను.30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత.వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్ చైర్‌లో నన్ను పంపించారు.వీల్ చైర్ కోసం అరగంట పాటు నేను కాలు నొప్పిని భరిస్తూనే ఎదురు చూశాను.
ఎయిర్ ఇండియా సంస్థకు ఒక వీల్‌చైర్ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా” అంటూ ఎయిర్ ఇండియా సంస్థ మీద కుష్బూ అసహనం వ్యక్తం చేశారు.ప్రస్తుతం కుష్బూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.







