యాంకర్ సుమ హోస్ట్ గా సుమ అడ్డా పేరుతో షో ప్రసారం అవుతుండగా ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.క్యాష్ షోకు బదులుగా ఈ షో ప్రసారం అవుతుండటం గమనార్హం.
ఈ నెల 4వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.అలీ, పోసాని కృష్ణమురళి ఈ ఎపిసోడ్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు.
సుమ అలీతో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎన్ని యుగాల నుంచి ఉన్నారో అలీగారు అంటూ కామెంట్ చేశారు.
ఆ తర్వాత సుమ పోసానితో మీరు ఎన్నిసార్లు రాజా రాజా రాజా అన్నారో నా రాజాను కూడా నేను అన్నిసార్లు రాజా అని అనలేదని సుమ చెప్పుకొచ్చారు.
మొబైల్ ఉండటం మంచిదా లేకపోవడం మంచిదా అని సుమ అడగగా పోసాని తన ఫీచర్ ఫోన్ ను చూపిస్తూ ఈ ఫోన్ లో ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్, చిన్న చిన్న మెసేజ్ లు చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ అవసరం ఏముందని కామెంట్ చేశారు.

మీ ఫోన్ ఏదని అలీని అడగగా సగం కొరికి పెట్టాడే ఎంగిలి చేసింది అది నాది అని ఆపిల్ ఫోన్ గురించి అలీ చెప్పడంతో పాటు నువ్వు కూడా కొరుకుతావా అంటూ అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు.సుమ వెంటనే వద్దు వద్దు అంటూ రియాక్షన్స్ ఇచ్చారు.మొబైల్ లేకపోవడమే మంచిదని ఎందుకంటే మనం ఏ పని చేసినా వీడియోస్ తీసి వైరల్ చేస్తారని ఒక స్టూడెంట్ చెప్పగా అలీ ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు.

అలీ ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వగా కూతురికి పెళ్లైనా ఇవేం తగ్గలేదు అసలు అంటూ కామెంట్ చేశారు.మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతంగా ఉన్నవాళ్ల జీవితాన్ని నాశనం చేయాలని పోసాని స్టూడెంట్ ప్రశ్నకు జవాబిచ్చారు.







