మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే విశాఖకు వెళ్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.అనంతరం కోటంరెడ్డి వ్యవహారంపై ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పినట్లు ఆడియో బయటకు వచ్చిందని సజ్జల తెలిపారు.ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడుకొని ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కాగా మూడు రాజధానుల కేసుపై ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.







