టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
మొదట మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది.తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా ఓ పేరు తెచ్చుకుంది.

ఇక నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేస్తుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది.
అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు పొందుతూ ఉంటుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్ లు చేయడం చాలా తక్కువనే చెప్పాలి.

నాచురల్ గానే కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తుంది.ఇక అనుపమ ఏదైనా ఫోటో షేర్ చేస్తే చాలు అది వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది.ఇక తన అభిమానులు మాత్రం తన పేరు మీద ఫన్నీ ఫన్నీ కొటేషన్స్ తో తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓ నేటిజన్ తను నువ్వు వేషాలు వెయ్యొద్దు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.తాజాగా తనకు సంబంధించిన ఒక వీడియో పంచుకుంది అనుపమ.
అందులో తన అందాలతో, తన నూడుల్స్ కురులతో ఫిదా చేసింది.ఆ వీడియో చూసి కుర్రాళ్ళు మాత్రం మతి పోగొట్టుకున్నారు అని చెప్పాలి.
అయితే ఓ నెటిజన్ మాత్రం బేబీ ఇటువంటివి చిలిపి వేషాలు వేయకు ఓకేనా అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ మధ్య వరుస సక్సెస్ లు అందుకుంది.
అంతేకాకుండా పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముందు వరుసలో ఉందని చెప్పాలి.







