చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
పనులు జరగకుండా సమావేశాలు ఎందుకని ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే మినిట్స్ బుక్ ను వైసీపీ కౌన్సిలర్ చింపివేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ సమక్షంలో వివాదం నెలకొంది.కౌన్సిలర్ మినిట్స్ బుక్ చింపడంపై ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా కౌన్సిలర్ మునిరాజుకు మున్సిపల్ అధికారులు నోటీసు ఇవ్వనున్నారు.