భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కాలంగా ఆ పార్టీలో అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ప్రచారం చేయకుండా సైలెంట్ గానూ ఉన్నారు.
అంతేకాక బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలంటూ ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటికి రావడం కలకలమే రేపింది.దీనిపై అధిష్టానం సైతం సంజయ్ ను వివరణ కోరింది.

ఇక కొద్ది రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనాలని రేవంత్ కోరగా దానికి వెంకట్ రెడ్డి అంగీకారం తెలిపారు.ఇది ఎలా ఉంటే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నికార్శైన కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో వెలసిన వాల్ పోస్టర్ కలకలం రేపుతుంది.
కోవర్ట్ వెంకట్ రెడ్డి అంటూ వెలసిన ఈ పోస్టర్ లో 13 అంశాలపై కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో ప్రశ్నలు సంధించారు.
హైదరాబాద్ , విజయవాడ 65వ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర ఎంపీ వెంకటరెడ్డి పై కోవర్ట్ వెంకటరెడ్డి అంటూ గుర్తుతెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అతికించారు.దీనిలో 13 ప్రశ్నలను వెంకటరెడ్డికి సంధించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన డిజిటల్ సభ్యత్వం ఉందా అంటూ ప్రశ్నించారు.అలాగే సొంత గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకోవాలని అసమర్థుడు అంటూ విమర్శించారు.

సొంత సోదరుడిని నార్కట్ పల్లి లో జడ్పిటిసి గా ఎందుకు గెలిపించుకోలేదు అని ప్రశ్నించారు.నకిరేకల్ మున్సిపాలిటీలో రెండు కౌన్సిలర్లను కూడా గెలిపించలేకపోయారు.సొంత సోదరుడిని గెలిపించుకోలేని వెంకటరెడ్డి ఎలా స్టార్ క్యాంపెనర్ అవుతాడు అని ప్రశ్నించారు.మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వడంతో పాటు మద్దతు ఇచ్చిన నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు.







