దేశంలోకి వివిధ రూపాల్లో స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది.స్మగ్లర్లు ఎంత వెలివిగా వ్యవహరించినా పోలీసుల ముందు వారి ఆటలు సాగవు.
అయినప్పటికీ స్మగ్లర్లు అతి తెలివితో దేశంలోకి వివిధ వస్తువులు, బంగారం, వజ్రాలు, కరెన్సీని స్మగ్లింగ్ చేస్తున్నారు.విమానాశ్రయాలలో కస్టమ్స్ అధికారులు చాలా ఖచ్చితంగా ఉంటున్నారు.
ప్రతి ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.ఈ క్రమంలో విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి.

తాజాగా ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో దాచిపెట్టి విదేశీ కరెన్సీని తీసుకువెళుతున్న ఓ ప్రయాణికుడిని ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు.ప్రయాణికుడి వద్ద నుంచి రూ.64 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.ప్రయాణికుడిని కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.
ప్రయాణికుడిని విచారించిన తర్వాత కస్టమ్ అధికారి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
పట్టుబడిన ప్రయాణికుడిని సురీందర్ సింగ్ రిహాల్‌గా గుర్తించారు.
జనవరి 29న బ్యాంకాక్ వెళ్లేందుకు ప్రయాణీకుడు టెర్మినల్ 3కి చేరుకున్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారి తెలిపారు.ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది.
అతను చెక్-ఇన్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, భద్రతా సిబ్బంది అతని కదలికను అనుమానాస్పదంగా ఉండడం గుర్తించారు.

కొంత సేపు పర్యవేక్షించిన తర్వాత అతని బ్యాగ్‌ని సెర్చ్ చేయాలని భద్రతా సిబ్బంది నిర్ణయించారు.ఎక్స్‌రే యంత్రం గుండా వెళుతుండగా ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో అనుమానాస్పద వస్తువు కనిపించింది.ఆ తర్వాత భద్రతా సిబ్బంది హ్యాండిల్‌ను తెరిచి చూశారు.
రెండు ట్రాలీ బ్యాగుల్లోనూ న్యూజిలాండ్ కరెన్సీ డాలర్లు, యూరోలు దాచారు.రికవరీ చేసిన మొత్తం గురించి నిందితుడిని ప్రయాణికుడిని ప్రశ్నించగా, అతను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు.
దీంతో అరెస్ట్ చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.







