టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్‌ఆర్ సినిమా వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడంతో పాటు ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది.
గోల్డెల్ గ్లోబ్ అవార్డు తో పాటు పదుల కొద్ది అంతర్జాతీ స్థాయి అవార్డులు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సొంతం అయ్యాయి అనే విషయం తెల్సిందే.అంతటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి తదుపరి సినిమా ఎప్పుడు ఉంటుంది.
ఎలా ఉంటుంది.
అంటూ ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పటికే మహేష్ బాబు హీరోగా జక్కన్న రాజమౌళి సినిమా ఉండబోతుంది అంటూ ఒక క్లారిటీ వచ్చేసింది.రాజమౌళి ఆ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.రాజమౌళి అన్ని సినిమాలకు కథలను అందిస్తూ ఉన్న విజయేంద్ర ప్రసాద్ కూడా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అని.అందుకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు.తాజాగా మరో ఇంటర్వ్యూలో రాజమౌళి తదుపరి సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ స్పందించాడు.

ఈ మధ్య కాలంలో రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో అని.అయితే ఆ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.అంతే కాకుండా మరి కొందరు హీరోల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో మూవీ మల్టీ స్టారర్ అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.అయితే విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా మల్టీ స్టారర్ సినిమా కాదని.సోలో హీరోగా మహేష్ బాబు కనిపించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.దాంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







