ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్.1 పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జీవోపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.
జీవోను ఉపయోగించి ఎవరిపైనా నిషేధం విధించడం లేదని చెప్పారు.జీవో వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ మీటింగ్ లకు అనుమతినిచ్చామన్నారు.ఎవరైనా పాదయాత్రలు చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని డీజీపీ సూచించారు.కాగా జీవో నంబర్.1పై ఇటీవల వెకేషన్ బెంచ్ ఇచ్చిన సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు సీజే బెంచ్ తప్పుబట్టింది.అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.