నందమూరి హీరోలలో ఒకరైన తారకరత్న ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.వైద్యులు ఆయనకు ఎక్మో చికిత్స అందించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఒకింత విషమంగానే ఉందని అయితే ప్రాణాలకు మాత్రం ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారని సమాచారం అందుతోంది.నందమూరి మోహనకృష్ణ తనయుడు అయిన తారకరత్న ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవడంతో పాటు నటుడిగా తారకరత్నకు మంచి పేరును తెచ్చిపెట్టింది.అయితే తారకరత్న పేరుపై ఒక అరుదైన రికార్డ్ ఉంది.ఈ రికార్డును రాబోయే రోజుల్లో కూడా ఎవరూ బ్రేక్ చేయడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ హీరో ఒకే సమయంలో 9 సినిమాలతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు విడుదలైతే మరికొన్ని సినిమాలు విడుదల కాలేదు.

అయితే నందమూరి తారకరత్నకు సొంతమైన ఈ రేర్ రికార్డ్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిన్న వయస్సులోనే తారకరత్న సినిమాల్లోకి రాగా జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా ఈ హీరో సినిమాల్లోకి వచ్చాడని ప్రచారం జరిగింది.బలమైన బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ లక్ లేకపోవడంతో తారకరత్న కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

తారకరత్న నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా క్లారిటీ లేదు.తారకరత్నకు కూడా సినిమాలపై ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది.రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే మాత్రం తారకరత్న సక్సెస్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారకరత్న రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.39 సంవత్సరాల వయస్సులో తారకరత్న అనారోగ్య సమస్యల బారిన పడటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.తారకరత్న సినిమాలకు దాదాపుగా దూరమైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







