బాలయ్య బాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ఒకవైపు హీరోగా రాణిస్తూనే, మరొకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూ, అలాగే సహాయం అనే కోరిన వారికి సహాయం చేస్తూ, అడగకపోయినా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు.

 Balakrishna Fall Down On Vehicle, Balakrishna, Fall Down, Video Viral, Tollywood-TeluguStop.com

ఇలా రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు బాలయ్య.ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబుకి తృటిలో ప్రమాదం తప్పింది.

అసలేం జరిగిందంటే.హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది.

తాజాగా బాలయ్య బాబు హిందూపురం పర్యటనలో పాల్గొన్నారు.ఈ పర్యాటనకు భారీగా అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే బాలయ్య ఒక వాహనం పై నిల్చొని కార్యకర్తలను, అభిమానులను పలకరిస్తుస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే బాలయ్య నిలబడిన వాహనం ముందుకు కదలడంతో బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు.

అప్పుడు వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు బాలయ్య బాబుని పట్టుకున్నారు.ప్రచార వాహనం పైన నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది.

బాలకృష్ణ పడిపోవడంతో అభిమానులు, కార్యకర్తలు కంగారు పడ్డారు.ప్రస్తుతం బాలకృష్ణ పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోని చూసిన అభిమానులు కొందరు హమ్మయ్య ప్రమాదం తప్పిందిఅని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే బాలయ్య బాబు సినిమా విషయాలకు వస్తే.ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకునే కలెక్షన్ ల కురిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube