జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికిప్పుడే తాను సీఎం కావాలని అనుకోవడం లేదన్నారు.
ప్రజలు ఒప్పుకుంటే తను సీఎం అవుతానని పేర్కొన్నారు.జనసేన ప్రాథమిక లక్ష్యం నేరాలు లేని ఏపీ అని తెలిపారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు.మెడలు వంచి ప్రజలకు సమాధానాలు చెప్పిస్తామని వెల్లడించారు.
అవసరానికి ఎజెండా మార్చేస్తానని తనను విమర్శిస్తున్నారని చెప్పారు.
అనంతరం పార్టీలతో పొత్తులపై పరోక్షంగా జనసేనాని స్పందించారు.
తన కారణాలు తనకున్నాయన్న పవన్ పిల్లల భవిష్యత్ ఆలోచించే మాట్లాడుతున్నట్టు తెలిపారు.అన్ని కులాలను అనుసంధానం చేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
మార్కిస్ట్.కమ్యూనిస్టును కాదన్న ఆయన తను హ్యూమనిస్టునంటూ వ్యాఖ్యనించారు.







