బీజేపీ కల తెలంగాణ లో నెరవేరేనా..?

తెలంగాణ లో పాగా వేయడానికి బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంది.కె లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ల హయాం లో పార్టీ కిందస్తాయి లో ఉండేది.

 Will Bjp's Dream Come True In Telangana Bjp, Bandi Sanjay, Mla Raghu Nandan Rao,-TeluguStop.com

ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని పరిస్థితి ఇంకా దిగజారి పోయింది.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో నుంచి గల్లీ కార్పొరేటర్ గా ఎదిగిన బండి సంజయ్ ను తీసుకొని వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన తర్వాత.

గల్లీ పార్టీ గ్రామాల్లోకి పాకింది.అయన అధ్యక్షుడుగా పగ్గాలు తీసుకున్న తర్వాత వచ్చిన దుబ్బాక ఎన్నికల్లో రఘు నందన్ రావు గెలిచి అసెంబ్లీ కి వచ్చారు.

తర్వాత టీఆరెఎస్ పార్టీ లోని మంత్రి ఈటెల రాజేంద్రను అర్ధాంతరంగా పార్టీ లోంచి పంపిస్తే ఆయన రాజీనామా చేసి వచ్చి ఉప ఎన్నికలకు వెళ్లారు.బండి సంజయ్ సారథ్యం లో ఆ ఎన్నికలు గెలిచారు.

ఇక బల్దియా ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా.దాదాపు 45 పై చిలుకు స్థానాలు గెలుచుకుని.

కాంగ్రెస్ పార్టీ నీ రెండు స్థానాలకు పరిమితం చేశారు.

Telugu Amitha Sha, Bandi Sanjay, Mlaraghu, Pm Modi-Politics

బండి సంజయ్ ను ఒక వెపన్ లా వాడి బీజేపీ ప్రతి చోట పాగా వేస్తూ వచ్చింది.ఇప్పుడు తెలంగాణ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా పాతాలి అని చూస్తోంది.తెలంగాణ లో పార్టీ గెలిస్తే.

హైదరాబాద్ వేదికగా.దక్షిణాదిన ఏలచ్చు అని బీజేపీ పెద్దలు భావిస్తూ ఉన్నారు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి చోట్ల సునాయాసంగా దూసుకుపోవచ్చు.హైదరాబాద్ లో దాదాపు దక్షిణ భారత్ దేశపు ప్రజలు చాలా మంది స్థిరపడి పోయారు.

ఇక్కండ కలమం వికసిస్తే .ఆయా రాష్ట్రాల పైన కూడా దాని ప్రభావం ఉంటుంది.స్థానిక పార్టీలను కూడా బలహీన పరిచి.సింగిల్ గా ఎదగాలి అని చూస్తున్నారు.ఒకవేళ అది తెలంగాణ లో కుదరక పోతే.కనీసం ప్రతి పక్ష హోదా అయినా సాధించినా దాని ప్రభావం చుట్టూ పక్క రాష్ట్రాల మీద ఉంటుంది.

Telugu Amitha Sha, Bandi Sanjay, Mlaraghu, Pm Modi-Politics

బల్దియా ఎన్నికల్లో మాదిరి గానే రాష్ట్రం లో పాగా వేయాలని 90 స్థానాలను టార్గెట్ చేశారు.జాతీయ కరువర్గ సమావేశాల్లోనూ.ఇదే అంశం పైన మాట్లాడి నట్టు తెలుస్తోంది.తన టార్గెట్ చేరాలి అంటే చేరికలు తప్పా వేరే మార్గం లేదు దాంతో పార్టీ లోకి కాంగ్రెస్ నేతలను వరుసబెట్టి చేర్చుకుంటూ ఉన్నారు.

మరి ఒక్క బండి సంజయ్ తోనే బీజేపీ అధికారం చే పడుతుందా.? లేక మరి కొంత మంది అర్ ఎస్ ఎస్ నేతలను బీజేపీ లోకి తీసుకొని వస్తుందా చూడాలి.స్థానికంగా బీజేపీ బలపడితే గానీ కుదరదు.మరి ఈ సారి బీజేపీ అనుకుంటూ ఉన్నట్టు తన ఆశను నెరవేర్చు కుంటుందా లేదా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube