దేశీయ టెక్ బ్రాండ్ నాయిస్ గేమింగ్ కోసం డిజైన్ చేసిన సరికొత్త “బడ్స్ కంబాట్” అనే ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది.ఇవి ట్రూ వైర్‌లెస్ బడ్స్‌గా అందుబాటులో ఉంటాయి.
ఈ బడ్స్ బ్లాక్, వైట్, గ్రే అనే మూడు రంగులలో వస్తాయి.బడ్స్ కంబాట్ ఇయర్‌బడ్స్ ధరను రూ.1,499గా కంపెనీ తెలిపింది.ఇండియన్ యూజర్లు నాయిస్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్, ఇతర ఆన్‌లైన్ స్టోర్‌లలో దీనిని కొనుగోలు చేయవచ్చు.
గేమ్‌లు ఆడే వారికి ఈ ఇయర్‌బడ్‌లు బాగా సరిపోతాయని కంపెనీ భావిస్తోంది.

బడ్స్ కంబాట్ ఇయర్‌బడ్స్ USB టైప్-సి ఛార్జింగ్ కనెక్టర్‌తో వస్తాయి.వాటర్ రెసిస్టెన్స్ వస్తాయి కాబట్టి వీటిని స్విమ్మింగ్ పూల్స్, ఇతర నీటి ప్రాంతాల్లో వాడేటప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు.ఈ బడ్స్‌లో నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి.
మోడర్న్ డిజైన్‌తో లాంచ్ అయిన ఈ బడ్స్ ఛార్జ్ అవసరం లేకుండా 36 గంటల పాటు ప్లే బ్యాక్ అందించగలవు.యూజర్లు గేమ్స్ ఆడుతున్నప్పుడు, కాల్‌లు చేస్తున్నప్పుడు లేదా వర్చువల్ సమావేశాలు చేస్తున్నప్పుడు స్పష్టమైన సౌండ్ అందించే మోడర్న్ టెక్నాలజీ ఇందులో అందించారు.కంపెనీ ప్రకారం, వీటిలోని 13mm డ్రైవర్లు, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ లాగ్-ఫ్రీ, హై-క్వాలిటీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తాయి.

ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్స్, యాక్షన్ గేమ్స్, ఇంకా మ్యూజిక్ బాగున్న గేమ్స్ ఆడేటప్పుడు సాధారణంగా ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కాస్త ఆలస్యంగా సౌండ్ అందిస్తుంటాయి.కానీ తమ బడ్స్ కంబాట్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌తో సమానంగా చాలా ఫాస్ట్ గా సౌండ్ ను యూజర్లకు అందిస్తాయని కంపెనీ తెలిపింది.







