అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ఒకరు.ఈయన ఎంట్రీ ఇవ్వడం ప్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం మంచి హిట్స్ అందుకుంటూ తనకంటూ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.
ఏమాయ చేసావే, మనం, మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు లాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య మళ్ళీ ఇటీవలే వచ్చిన థాంక్యూ సినిమాతో మాత్రం ప్లాప్ అందుకున్నాడు.
ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ చైతూ రేసులో వెనుక బడ్డాడు.
అంతే కాదు నాగ చైతన్య హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా కూడా ప్లాప్ అవ్వడంతో ఈయన వెంటవెంటనే రెండు ప్లాప్స్ అందుకున్నాడు.అయితే నాగ చైతన్య వరుస సినిమాలను లైనప్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్లాప్స్ పడడంతో కొన్ని మిగతా సినిమాలపై కూడా ప్రభావం పడుతుంది.
![Telugu Bangarraju, Keerthy Suresh, Naga Chaitanya, Parasuram, Sarkaruvaari, Toll Telugu Bangarraju, Keerthy Suresh, Naga Chaitanya, Parasuram, Sarkaruvaari, Toll]( https://telugustop.com/wp-content/uploads/2023/01/Naga-Chaitanya-Parasuram-keerthy-suresh-Tollywood.jpg)
నాగ చైతన్య లైనప్ లో మహేష్ డైరెక్టర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.పరశురామ్ పెట్ల మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత నాగ చైతన్యతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది.
![Telugu Bangarraju, Keerthy Suresh, Naga Chaitanya, Parasuram, Sarkaruvaari, Toll Telugu Bangarraju, Keerthy Suresh, Naga Chaitanya, Parasuram, Sarkaruvaari, Toll]( https://telugustop.com/wp-content/uploads/2023/01/Parasuram-keerthy-suresh-Tollywood-custody-movie.jpg)
అయితే ఈ సినిమా అప్పుడే పట్టాలెక్కుతోంది అని అంతా అనుకున్నారు కానీ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.కానీ చైతూ మరో సినిమా అయితే స్టార్ట్ చేసాడు.ఇది మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.దీంతో ఈ సినిమా ఉందా? లేదంటే ఆగిపోయిందా? అనేది అర్ధం కావడం లేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయింది అని అంటున్నారు.కారణాలు తెలియక పోయిన ఇది ఆగిపోయింది అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు.
చూడాలి ఇది నిజమో కాదో.