యువ హీరోల్లో టాలెంట్ ఉన్నా కూడా కెరీర్ లో వెనకపడ్డాడు సందీప్ కిషన్.అతను హీరోగా మైఖేల్ అంటూ ఒక పాన్ ఇండియా సినిమా వస్తుంది.
ఫిబ్రవరి 3న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ చేశారు.సందీప్ కిషన్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ భారీ సినిమా అని చెప్పొచ్చు.
ఇక యాక్షన్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సందీప్ కిషన్ ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నాడు.సినిమాలో విజయ్ సేతుపతి నటించడం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

సందీప్ కిషన్ కి జోడీగా దివ్యాన్ష కౌశిక్ నటించింది.సామ్ సిఎస్ మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను రంజిత్ జెయకోడి డైరెక్ట్ చేశారు.సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో అయినా సందీప్ కిషన్ కు హిట్ పడుతుందో లేదో చూడాలి.సందీప్ కిషన్ మాత్రం ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.







