కాంతార2 షూటింగుకు ముహూర్తం ఫిక్స్... వెల్లడించిన మేకర్స్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సినిమాలలో కాంతార ఒకటి.దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైంది.

 Prequel To Kantara Confirmed: Rishab Shetty Working On Script, Shooting Likely-TeluguStop.com

కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో వివిధ భాషలలో విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా అన్ని భాషలలో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రెండు విభాగాలలో ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉన్న విషయం తెలిసిందే.

Telugu Hombale Makers, June, Kantara, Kantara Prequel, Oscar, Rishab Shetty-Movi

ఇలా ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఇదివరకు ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే సీక్వెల్ తప్పనిసరిగా ఉంటుందని చిత్ర నిర్మాతలు హోంబలే ఫిలిం మేకర్స్ కూడా వెల్లడించారు.అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి మరోసారి మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ చిత్రం చేయాలా లేదా అన్న విషయం గురించి చిత్ర బృందం పంజుర్లీ మాత ఆశీస్సులు కూడా తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Hombale Makers, June, Kantara, Kantara Prequel, Oscar, Rishab Shetty-Movi

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను వర్షాకాలంలో చిత్రీకరించాల్సి ఉండగా ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని జూన్ నెలలో ప్రారంభించబోతున్నట్లు హోంభలే ఫిలిమ్స్ వెల్లడించారు.ఇలా ఈ సినిమా జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం చేసుకుని వచ్చే ఏడాది సమ్మర్ సెలవలలో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube