బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల గురించి అందరికీ సుపరిచితమే అయితే ఈయనను ఈ పేరుతో పిలిస్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తారు.ఇలా బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ లోని కార్తీక్ పాత్రలో డాక్టర్ గా నటించి డాక్టర్ బాబుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ఈ సీరియల్ తో ఈయనకు హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇక ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇక తన భార్య మంజుల పరిటాలతో కలిసి ఈయన యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తూ సందడి చేస్తుంటారు.
ఇకపోతే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నిరుపమ్ పరిటాల తాజాగా రాజకీయ నాయకుడు దివంగత నేత పరిటాల రవీంద్ర కుమారుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ను కలిశారు.ఈ క్రమంలోనే ఆయనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రియల్ హీరో పరిటాల శ్రీరామ్ ను అనుకోకుండా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన చెప్పుకొచ్చారు.

ఇలా పరిటాల శ్రీరామ్ ను రియల్ హీరో అంటూ డాక్టర్ బాబు సంబోధించడంతో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చెలరేగింది.పరిటాల శ్రీరామ్ ఏంటి రియల్ హీరో ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.







