బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె తనకు తోచిన విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడుతూ పలు వివాదాలకు కారణం అవుతుంటారు.
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈమె ఇందిరాగాంధీ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోని ఎమర్జెన్సీ టాకీ షూటింగ్ పూర్తి కాగానే సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.ఈ సినిమా కోసం కొన్ని తన ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఈమె తెలియజేశారు.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా తాను డెంగ్యూతో బాధపడుతూ షూటింగ్ కి కూడా రాలేని పరిస్థితికి చేరుకున్నానని తెలిపారు.

అనంతరం ఈమె దివంగత ఇందిరాగాంధీ పాత్రలో ఉన్నటువంటి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలలో ఈమె కెమెరా వెనుక వైపు కూర్చొని మైక్రోఫోన్లో మాట్లాడుతూ అచ్చం ఇందిరా గాంధీని తలపిస్తోందని చెప్పాలి.ఈ ఫోటోలను షేర్ చేస్తూ.
తన జీవితంలో ఒక మహత్తర ఘట్టం పూర్తి అయిందని, ఈ ప్రయాణంలో హాయిగా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుందని ఈమె తెలిపారు.

అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఆస్తులను తాకట్టు పెట్టడం, డెంగీ తో బాధపడుతూ రక్త కణాల సంఖ్య తగ్గిపోయినప్పటికీ షూటింగుకు ఏమాత్రం వెనకాడ లేదని ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని భరించానని తెలియజేశారు.అయితే సినిమాపై ఉన్న పిచ్చితోనే ఇదంతా చేశానని ఈమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం కంగనా చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







