మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.ఇప్పటికి కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
అయినా కూడా ఈ అమ్మడు కెరియర్ పై ఆశలు వదిలేసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే గత కొన్నాళ్లుగా మ్యూజిక్ ఆల్బమ్స్, ఐటమ్ సాంగ్స్ తో పాటు చిన్న సినిమా లకు ఓకే చెబుతోంది.
గత రెండు మూడు సంవత్సరాలుగా తమన్నా కెరియర్ లో అద్భుతాలు ఏమి జరగలేదు.భారీ విజయాలు ఆమె సొంతం కాలేదు, ఎప్పుడూ బిజీగానే కనిపిస్తోంది కానీ మునుపటి జోష్ ఆమెలో లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు మూడు సంవత్సరాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా కనుమరుగు అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా లకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ ఏమీ లేవు.అందుకే తమన్నా వార్తల్లో నిలవడం లేదు.అప్పుడప్పుడు తన అందాల ఫోటో షూట్స్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అభిమానులను అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ముందు ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఐటమ్ సాంగ్స్ తో అద్భుతమైన పేరు ప్రతిష్టలు దక్కించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఆ అవకాశాలను కూడా వరుసగా రాబట్టుకోలేక పోతుంది.

వయసు పెరగడంతో మిల్కీ బ్యూటీ యొక్క క్రేజ్ తగ్గింది, కానీ ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇదే సమయంలో మిల్కీ బ్యూటీ పెళ్లి పై కూడా వార్తలు వస్తున్నాయి.కెరియర్ లో స్లో డౌన్ అయిన కారణంగా మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.భోళా శంకర్ సినిమా తో చిరంజీవి భారీ విజయాన్ని తమన్నాకు అందిస్తే అప్పుడైనా కెరియర్ ఊపందుకుంటుందేమో చూడాలి.







