హైదరాబాద్ లో మటన్ పేరుతో దూడల మాంసం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.మేక, గొర్రెల మాంసం పేరుతో గేదెలు, దూడలను కోసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది.
అదేవిధంగా పలు హోటళ్లకు దూడ మాంసాన్ని ముఠా సభ్యులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఇదే మాంసాన్ని రెస్టారెంట్లలో వినియోగిస్తున్నారా అనే కోణంలో కాలాపత్తార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జంతు మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం 22 గేదెలు, దూడలను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మాంసాన్ని సైతం పట్టుకున్నారు.







