రాష్ట్రం లో 25 మంది ఎమ్మెల్యే ల పై వ్యతిరేకత ఉందని.సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై సీఎం కేసీఆర్ సీరియస్ అయి నట్టు తెలుస్తోంది.స్వంతంగా సర్వేలు చేయించామని.25 మంది ఎమ్మెల్యే లను మార్చితే.విజయం మాదే నని అన్నారు.దాంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఎర్రబెల్లి మాటలకు చాలా మంది ఎమ్మెల్యే లు సైతం కంగారు పడ్డారు.ఈ సారి ఎవరి సీటు కు ఎసరు రానుంది అని లెక్కలు సైతం వేసుకున్నారు.
ఇక ఆ విషయం ఆ నోటా ఈ నోటా కెసిఆర్ చెవిలో పడటం తో ఆయన అలెర్ట్ అయ్యారు.
ఇంతకు ముందు ఒక మీటింగ్ లో.అయన ఎమ్మెల్యే లందరికీ హామీ ఇచ్చేశారు.వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న నేతలే మళ్లీ పోటీ చేస్తారని చెప్పేశారు.
దాంతో ఎమ్మెల్యే లలో ఫుల్ జ్యోష్ నిండింది.ఇలాంటి టైమ్ లో ఎర్రబెల్లి కామెంట్స్ కొత్త అనుమానాలను తీసుకు వచ్చింది.

ఈ టైమ్ లో సీటు రాదు అనుకునే నేతలు పార్టీ మారడం స్టార్ట్ అయితే.అది కెసిఆర్ పార్టీ ను మానసికంగా కుంగి పోయేలా చేస్తుంది.దానికి తోడు పార్టీ కేడర్ కూడా కన్ఫ్యూజన్ లో పడుతుంది.అందుకే సీఎం కెసిఆర్ అలెర్ట్ అయ్యారు.ఎన్నికల ముందు రోజు వరకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటూ ఉన్నారు.అలిగిన నేతలకు ఎమ్మెల్సీ హామీ ఇస్తున్నాడు.
మరి కొందరికి మంత్రి పుచి ఇచ్చారు.

ఈ సారి ఎలాగైనా.వంద సీట్లు తెచ్చుకొని జాతీయ స్థాయి లో ఎదగాలి అని చూస్తున్నారు. ఎర్రబెల్లి సర్వే గురించి కెసిఆర్ కు ముందే తెలుసని.
అందుకే ఎర్రబెల్లి నీ మందలించాడు అని విశ్లేషకులు చెబుతున్నారు.నిజంగా ఎర్రబెల్లి సర్వే కరెక్ట్ అయితే.25 మంది ఎమ్మెల్యే లకు ముప్పు తప్పదు.







