ఏడు సినిమాల్లో మూడు చిరంజీవివే.. మెగాస్టార్ కే ఈ రికార్డ్ సొంతమా?

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అందరూ భావిస్తారు.రీఎంట్రీలో చిరంజీవి హవా కొంతమేర తగ్గినా సీనియర్ హీరోలలో చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వడం ఇతర హీరోలకు సైతం కష్టమవుతోంది.

 Megastar Chiranjeevi Rare Record Waltair Veerayya Syeraa Khaidi No 150 Details,-TeluguStop.com

ఏడో రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన టాప్7 సినిమాలలో మూడు సినిమాలు చిరంజీవివే ఉండటం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఈ రేర్ రికార్డ్ సొంతం కావడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషం కలిగిస్తోంది.వాల్తేరు వీరయ్య ఏడో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే ఏడో రోజు ఈ సినిమా ఏకంగా 4.85 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాలను పరిశీలిస్తే అల వైకుంఠపురములో మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఈ సినిమా కలెక్షన్లు ఏకంగా 8.43 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఈ జాబితాలో బాహుబలి2 సినిమా రెండో స్థానంలో ఉంది.

సైరా నరసింహారెడ్డి మూడో స్థానంలో సరిలేరు నీకెవ్వరు నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్ ఐదో స్థానంలో ఖైదీ నంబర్ 150 ఆరో స్థానంలో వాల్తేరు వీరయ్య ఏడో స్థానంలో ఉన్నాయి.టాప్ 7లో మూడు సినిమాలు చిరంజీవివే కావడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది.

చిరంజీవి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి పారితోషికం కూడా ఊహించని రేంజ్ లో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube