బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు.ప్రస్తుతం ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే కాకుండా వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న రష్మి ఇంట విషాదం చోటుచేసుకుంది.ఇలా తన ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మరణించారు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా శుక్రవారం తుది శ్వాస విడిచారని రష్మి గౌతమ్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.బరువెక్కిన గుండెతో కుటుంబ సభ్యులు మొత్తం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికామని రష్మీ తెలియచేశారు.ప్రమీల మిశ్రా చాలా స్ట్రాంగ్ ఉమెన్.మా అందరి పై తన ప్రభావం ఎంతగానో ఉంది ఆమె ప్రస్తుతం మాకు దూరమైన ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా మాతోనే ఉంటాయి.
ఓం శాంతి అంటూ రష్మి తన గ్రాండ్ మదర్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ బి స్ట్రాంగ్ అంటూ రష్మికి ధైర్యం చెబుతున్నారు.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండి తెరపై తాజాగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు.అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా సందడి చేయబోతున్నారు.







