టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడిగా గౌతమ్ అందరికీ సుపరిచితమే అయితే గౌతమ్ సితార మాదిరిగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండదు.ఈయనకు సోషల్ మీడియా ఖాతా కూడా లేకపోవడం గమనార్హం.
ఇక గౌతమ్ గురించి అభిమానులకు తెలియాలి అంటే అది నమ్రత ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటుంది.నమ్రత అప్పుడప్పుడు తన కొడుకు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా నమ్రత గౌతమ్ గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన కుమారుడు గౌతమ్ మొదటిసారిగా ఒక కల్చరల్ ట్రిప్ నిమిత్తం విదేశాలకు ఒంటరిగా వెళుతున్నారని నమ్రత తెలియజేశారు.
గౌతమ్ ఒంటరిగా వెళ్తుంటే నాలో సగభాగం వెళ్లిపోయినట్టు ఉంది.నేను ఒంటరి అయ్యాను అనే ఫీలింగ్ నాలో కలుగుతుంది.
మెల్లిమెల్లిగా నేను బయటపడాలనుకుంటున్నాను.

గౌతమ్ తిరిగి నా కళ్ళ ముందు కనిపించే వరకు నాకు ఒంటరి అనే ఫీలింగ్ ఉంటుందని నమ్రత గౌతమ్ గురించి పోస్ట్ చేశారు.నా బిడ్డ ఇలా సొంత రెక్కలతో ఒంటరిగా ఎగిరిపోతున్నాడు.ఈ వారం మొత్తం నువ్వు నీ ట్రిప్ లో ఎంతో సంతోషంగా ఉండాలని, అడ్వెంచర్లు చేయాలని, నీలో నువ్వు అన్వేషించుకొని నిన్ను కొత్తగా ఆవిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను అంటూ

నమ్రత తన కొడుకుకు సెండ్ ఆఫ్ ఇచ్చారు.అయితే మహేష్ బాబు ఫ్యామిలీ ఇలా విదేశీ ట్రిప్పులకు వెళ్లడం కొత్తేమీ కాదు అయితే ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్లేవారు కానీ మొదటిసారి గౌతమ్ మాత్రమే ఒంటరిగా వెళ్లడంతో నమ్రత తన కొడుకు గురించి సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







