తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీకానున్నారు.ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఆమె కేసీఆర్ తో ప్రధానంగా చర్చించనున్నారు.
ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అదేవిధంగా 317 జీవో బాధితుల సమస్యను కూడా మంత్రి నివేదించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో సీఎంతో భేటీ అనంతరం టీచర్ల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.







