బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె సింగర్ నిక్ జోనాస్ నుప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ దంపతులకు పెళ్లయిన తర్వాత సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.ఈ బిడ్డకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అనే పేరును పెట్టారు.
ఇక ప్రియాంక చోప్రా కూతురు నెలల నిండకముందే జన్మించడంతో మూడు నెలల పాటు తనని NICU లో ఉంచి చికిత్స అందించిన సంగతి మనకు తెలిసిందే.

మూడు నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా కుమార్తె సాధారణ స్థితికి చేరుకున్న అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు.అయితే తన కూతురు గురించి ఇప్పటివరకు ఎక్కడ ప్రస్తావించని ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కుమార్తె గురించి, అలాగే ఎందుకు తాను సరోగసి ద్వారా బిడ్డను కనాల్సి వచ్చిందనే విషయాల గురించి కూడా తెలియజేశారు.ఇలా కూతురు పుట్టిన తర్వాత మొదటిసారి ప్రియాంక చోప్రా తన కుమార్తె గురించి అనేక విషయాలను తెలియజేశారు.

ప్రియాంక చోప్రా స్వయంగా తాను పిల్లలకు జన్మనివ్వకుండా అద్దే గర్భం ద్వారా పిల్లలకు జన్మనివ్వడానికి గల కారణం కేవలం తనకు ఉన్న అనారోగ్య సమస్యలే కారణమని తెలిపారు.ఇలా తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాను సరోగసి ద్వారా తల్లిగా మారానని ప్రియాంక చోప్రా వెల్లడించారు.తనకు సరోగసి ద్వారా బిడ్డను కనివ్వడం కోసం దాదాపు ఆరు నెలల పాటు మహిళ కోసం వెతికానని అయితే ఒక దేవత తమ కోరిక నెరవేర్చింది అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తన కుమార్తెకు సంబంధించిన విషయాలను తెలియజేశారు.ఇక తరచూ ఈమె తన కూతురి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా తన కూతురి ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన కూతురి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







