పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలలో పుష్ప 2 ఒకటి.2021 సంవత్సరంలో పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ అద్భుతమైన హిట్ అందుకొని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుంది.ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ భాగం కానున్నట్లు సమాచారం.ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించిన అనంతరం విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఈ సినిమాలో నటించబోతున్నారని సమాచారం.అందుకు సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనిన్నట్టు తెలుస్తుంది.
త్వరలోనే మేకర్స్ ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయునన్నట్టు సమాచారం.

ఇకపోతే సుకుమార్ ఇదివరకు తన దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో రంగస్థలం వంటి సినిమాలలో జగపతిబాబు కీలక పాత్రలలో నటించారు.ఈ రెండు సినిమాల ద్వారా జగపతిబాబుకు మంచి పేరు వచ్చింది.ఈ క్రమంలోనే పుష్ప సీక్వెల్ చిత్రంలో సుకుమార్ అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ సినిమాలో ఈయనకు ప్రత్యేకమైన పాత్రలో నటించే అవకాశం కల్పించినట్టు సమాచారం.
మరి ఇందులో ఎంతవరకు నిజముంది ఒకవేళ జగపతిబాబు నటించిన ఎలాంటి పాత్రలో నటించబోతున్నారనే ఆత్రుత అభిమానులలో నెలకొంది.







