పుష్ప సీక్వెల్ లో సీనియర్ నటుడు... సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న సుకుమార్!

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలలో పుష్ప 2 ఒకటి.

2021 సంవత్సరంలో పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ అద్భుతమైన హిట్ అందుకొని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. """/"/ ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగ్ లో చిత్రీకరణ జరుగుతుంది.

ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా టాలీవుడ్ సీనియర్ స్టార్ భాగం కానున్నట్లు సమాచారం.

ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించిన అనంతరం విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఈ సినిమాలో నటించబోతున్నారని సమాచారం.

అందుకు సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనిన్నట్టు తెలుస్తుంది.త్వరలోనే మేకర్స్ ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయునన్నట్టు సమాచారం.

"""/"/ ఇకపోతే సుకుమార్ ఇదివరకు తన దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో రంగస్థలం వంటి సినిమాలలో జగపతిబాబు కీలక పాత్రలలో నటించారు.

ఈ రెండు సినిమాల ద్వారా జగపతిబాబుకు మంచి పేరు వచ్చింది.ఈ క్రమంలోనే పుష్ప సీక్వెల్ చిత్రంలో సుకుమార్ అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ సినిమాలో ఈయనకు ప్రత్యేకమైన పాత్రలో నటించే అవకాశం కల్పించినట్టు సమాచారం.

మరి ఇందులో ఎంతవరకు నిజముంది ఒకవేళ జగపతిబాబు నటించిన ఎలాంటి పాత్రలో నటించబోతున్నారనే ఆత్రుత అభిమానులలో నెలకొంది.