టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ.ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా వ్యవహరించారు.
ఈ సినిమాతోనే మురళీ కిషోర్ దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నాడు.ఇందులో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి వాసవసుహాస అనే పాట విడుదల అయిన విషయం తెలిసిందే.
ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కానుంది.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసారు చిత్ర బృందం.
ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా గుంటూరు కాలేజీ లో VVIT vs VBVK అనే క్రికెట్ టీం తో మ్యాచ్ ఆడారు.
ఈ మ్యాచ్ లో ప్రేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్లు సైదులు చేతుల మీదుగా ‘ఓ బంగారంని చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం’ అనే పాటను విడుదల చేశారు.

తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ప్రొడ్యూసర్ బన్నీ వాసు.ఈ పాటకు రీల్ చేసి గీత ఆర్ట్స్ ను ట్యాగ్ చేయండి.సెలెక్ట్ అయిన పదిమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సినిమాను ఫ్రీగా చూపించడంతోపాటు పుష్పా సినిమా షూటింగ్ కు తీసుకెళ్దాం అనే బంపర్ ఆఫర్ ను ప్రకటించాడు బన్నీ వాసు.
కాలేజీ యువకులు రీల్స్ చేయడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు.రీల్స్ చేసి ఎలా అయినా సినిమా చూసే అవకాశాన్ని అలాగే పుష్ప పార్ట్ 2 సినిమా చూసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకోవడం కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అలాగే ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.








