తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది.గత కొద్దిరోజులుగా రాజమౌళి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.
సినిమాలు తెరకెక్కించడానికి రాజమౌళి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న విధంగా తన సినిమాలతో భారీగా కలెక్షన్లను రాబట్టడం మాత్రమే కాకుండా, సినిమా సినిమాకి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటు చెబుతున్నారు.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నాడు రాజమౌళి.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో బడా హీరోలు సైతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను చేయాలని ఆశపడుతున్నారు.ఇకపోతే రాజమౌళి ఇటీవల తెలుగులో ఆర్ఆర్ఆర్ ను సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు.ఇప్పటికే ఆ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రాజమౌళి అదే ఆఖరి సినిమా అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇకపై రాజమౌళి సినిమాలు అన్నీ కూడా తన సొంత ప్రొడక్షన్ లేదా సొంత టీం తోనే చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
కానీ ఒక సినిమాను మాత్రం తన సన్నిహితుడు అయిన సాయి కొర్రపాటికి చేయబోతున్నాడట.రాజమౌళి కి మొదటి నుంచి అండగా తోడుగా సాయి కొర్రపాటి ఉంటున్న విషయం తెలిసిందే.అందుకే సరైన సినిమా ఒకటి రాజమౌళి చేయబోతున్నారట.అంతే కాకుండా సాయి కొర్రపాటికి బలమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని రాజమౌళి భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.సాయి కొర్రపాటితో ఒక్కసారి మాత్రమే సినిమాను తీసి ఆ తర్వాత తన సొంత ప్రొడక్షన్ లేదంటే సాయి కొర్రపాటి సహకారంతో సినిమాలు చేయాలి అని ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది.