డ్రైవింగ్ సరిగా నేర్చుకోకపోతే, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు జరగడం అనివార్యం.ఈ విషయం తెలిసినా కొందరు ఏమవుతుందిలే అనే భావనతో వాహనాలు నడిపేస్తుంటారు.
ఇలాంటి వ్యక్తులు చేసిన యాక్సిడెంట్లు ఇప్పటికే నెట్టింట్లో చాలా వైరల్ అయ్యాయి.ఇప్పుడు, అలాంటి వీడియో ఒకటి విస్తృతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఒక కారు పింగాణి, వంట పాత్రలు అమ్మే క్రాకరీ స్టోర్‌లోకి దూసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.బుధవారం రాత్రి, వడోదరలోని అల్కాపురి బీపీసీ రోడ్‌లోని ఓ క్రాకరీ షాప్ ముందుకి ఓ మహిళా డ్రైవర్ కారు వేసుకుని వచ్చింది.
అక్కడ కారు పార్కింగ్ చేస్తుండగా బ్రేక్‌కి బదులు యాక్సిలరేటర్ నొక్కింది.అంతే, రెప్ప పాటు సమయంలో కారు షోరూంలోని ఐదు మెట్లు ఎక్కేసింది.అది షాప్ అద్దాలు పగులగొట్టి మరీ లోపలికి దూసుకెళ్ళింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.కానీ షోరూమ్ మాత్రం ధ్వంసమైంది.లక్షల విలువైన పాత్రలు కూడా విరిగిపోయాయి.
దాంతో ఆ షాపు యజమాని మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఒక్కసారిగా కారు అద్దాలను ఢీకొట్టడం పెద్దగా శబ్దం రావడంతో షోరూం యజమాని మహేశ్‌భాయ్ సింధానీ, సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు.
అదృష్టవశాత్తూ, మహిళతో సహా షోరూమ్‌లోని ఏ ఉద్యోగీ గాయపడలేదు.

ఈ ఘటన మొత్తం షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.స్థానికులు ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడా చూడలేదనట్లు వింతగా వచ్చి చూసి పోయారు.కొందరు వీడియోలు తీసి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది కాస్త వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.‘మా తల్లే’ అని ఆమె డ్రైవింగ్ స్కిల్స్ ని ఎగతాళి చేస్తున్నారు.







