పండ్ల వ్యాపారిపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన యువకులు.. షాకింగ్ వీడియో వైరల్..

రోజురోజుకి కొందరికి మనుషుల్లో మానవత్వానికి బదులు క్రూరత్వం పెరిగిపోతోంది.చిన్న కారణాలకే వీరు కోపంతో ఊగిపోతూ పెద్ద దారుణాలకు పాల్పడుతున్నారు.

 Fruit Seller Thrashed After Dispute Over Rs 5 In Noida Details, Fruit Seller, Vi-TeluguStop.com

చివరికి జైలు పాలు కూడా అవుతున్నారు.వీరిని చూసేనా ఇతరులు మారతారా అంటే ఎవరూ మారడం లేదు.తాజాగా కేవలం రూ.5 విషయంలో ఇద్దరు యువకులు ఒక అమాయక పండ్ల వ్యాపారిని విచక్షణారహితంగా చితకబాదారు.

అందరూ చూస్తుండగానే మదమెక్కిన మృగాళ్ల వలె రెచ్చిపోయి పిడిగుద్ధులు గుద్దుతూ వారు తమ క్రూరత్వాన్ని బయటపెట్టారు.అసలు పండ్ల వ్యాపారిని కక్ష కట్టినట్లు కొట్టాల్సిన అవసరమేంటి? ఈ షాకింగ్ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? వంటి వివరాలు తెలుసుకుంటే.జనవరి 16 సాయంత్రం వేళ నోయిడాలోని ఫేజ్-1లో ఒక పండ్ల విక్రేత వద్దకు ఒక యువకుడు వెళ్లాడు.ఆ పండ్ల వ్యాపారి పేరు అజయ్.

అతను హరౌలా మండిలో పండ్ల దుకాణం నడుపుతున్నాడు.కాగా సోమవారం అమిత్ అనే కస్టమర్ అతని షాప్‌కి వచ్చి యాపిల్స్‌ కావాలని అడిగాడు.అప్పుడు అజయ్ కిలో యాపిల్ ధర రూ.90 అని చెప్పాడు.దాంతో అమిత్ కిలో రూ.85కి ఇవ్వాలని బేరం ఆడాడు.కానీ తనకు ఆ రేటు గిట్టదని అజయ్ చెప్పాడు.అయినా కూడా అమిత్‌ 85 రూపాయలకే ఇవ్వాలని పట్టుబట్టాడు.అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ విషయం మరింత ముదిరింది కాబట్టి అమిత్ తన స్నేహితుడితో కలిసి అజయ్‌పై పిడిగుద్దులు కురిపించాడు.ఈ గొడవను స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే ఫేజ్-1 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube