అసలు ఎవడండి ' గంటా ' ? రెచ్చిపోయిన అయ్యన్న ! బాబు రియాక్షన్ ఏంటో ?

అసలు ఎవడండి గంటా? లక్షల్లో వాడు ఒక్కడు.లక్షల్లో నేనొక్కడిని.

 Who Is The 'ganta'? Annoyed Ayanna , Ganta Srinivasarao, Chintakayala Ayyanna Pa-TeluguStop.com

గంటా ఏమైనా పెద్ద నాయకుడా ? ప్రధానా అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయారు టిడిపి సీనియర్ నేత,  మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.సొంత పార్టీ కి చెందిన ఎమ్మెల్యే పై ఈ విధంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మొదటినుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అయ్యన్నపాత్రుడు కి మధ్య విభేదాలు ఉన్నాయి.గంటా వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పుడు అయ్యన్న ఏవిధంగా గంటా శ్రీనివాసరావు పై విమర్శలు చేసేవారో టిడిపిలో గంటా చేరిన తరువాత కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చేవారు .

అయితే ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు జోక్యం చేసుకున్నా,  వీరిద్దరి మధ్య విమర్శలు , ప్రతి విమర్శలు జరగకుండా పార్టీకి అవి డామేజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.దీనికి తగ్గట్టుగానే చాలా కాలం పాటు వీరిద్దరూ సైలెంట్ గానే ఉంటున్నారు.

అయితే తాజాగా గంటా  శ్రీనివాసరావు టిడిపిలో యాక్టివ్ కావడం , ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి సైలెంట్ గా ఉంటూ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన సమయంలో ఈ విధంగా యాక్టివ్ కావడంపై చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Telugu Ap, Chandrababu, Lokesh, Visakha Mla, Ysrcp-Political

కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని , మేము ఎవరికీ వ్యతిరేకులం కాదు.పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని , ఎన్నికలు వస్తాయని మళ్లీ వస్తున్నారంటూ గంటా శ్రీనివాసరావు ను ఉద్దేశించి విమర్శలు చేశారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండని వారిని చూస్తే మాకు బాధేస్తుందని,  మాకు అందరూ కావాలి,  పార్టీ కష్ట కాలంలో దూరంగా ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని తాము కోరుకుంటున్నామని అయ్యన్న చెప్పుకొచ్చారు.

అయితే అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలపై ఇప్పటివరకు గంటా శ్రీనివాసరావు కానీ,  ఆయన అనుచరులు కానీ ప్రతి విమర్శలు చేయలేదు.ఇప్పుడిప్పుడే గంటా శ్రీనివాసరావు పార్టీలో యాక్టివ్ కావడంతో పాటు,  లోకేష్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు .

Telugu Ap, Chandrababu, Lokesh, Visakha Mla, Ysrcp-Political

అలాగే పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న లోకేష్ తోను సమన్వయం చేసుకుంటూ.పాదయాత్రను సక్సెస్ చేసే బాధ్యతలను గంటా తీసుకున్నారు .ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు అటు యువ నాయకుడు లోకేష్ తోను , చంద్రబాబుకు దగ్గరవుతూ ఉండడం ఉత్తరాంధ్రలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో అయ్యన్నపాత్రుడు మళ్లీ ఈయనను టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు.ఈ ఇద్దరు కీలక నాయకుల విషయంలో అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు ? ఏ విధంగా వీరి వ్యవహారం ముదరకుండా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube