భోళా శంకర్ విషయంలో భారీగా కండిషన్లు పెట్టిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇంకా ఒక సినిమా సెట్స్ పైఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

 Megastar Has Given Heavy Conditions In The Case Of Bhola Shankar, Megastar, Heav-TeluguStop.com

అయితే తాజాగా ఈయన దసరా పండుగ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇలా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి తదుపరి ప్రాజెక్టు భోళా శంకర్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.ఇదివరకు కేవలం సినిమా కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న చిరంజీవి ఇకపై సినిమా విజువల్స్ అలాగే మ్యూజిక్, పాటల గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్యలో పాటలు కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భోళా శంకర్ మ్యూజిక్ విషయంలో కూడా చిరంజీవి దర్శకులకు కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మహతి సర్వసాగర్ సంగీతం అందించనున్నారు.డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాలో కొన్ని పెప్పీ ట్యూన్ లను రూపొందించడానికి మహతితో కలిసి పని చేయాల్సి ఉందట.అయితే ఈ సినిమా కోసం ఆకర్షణీయమైన ట్యూన్స్ ఆకట్టుకునే విజువల్స్ ను రూపొందించడంపై దృష్టి పెట్టమని చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కు కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.వాల్తేరు వీరయ్యతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర బృందానికి పలు సూచనలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటి కీర్తి సురేష్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube