ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.ఒక హీరో తన సినీ కెరియర్లో బ్లాక్ బాస్టర్ అందుకున్న సినిమాలను తిరిగి తమ పుట్టినరోజు సందర్భంగా లేదా సినిమా యానివర్సరీ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలకృష్ణ వంటి హీరోలు నటించిన సినిమాలను తిరిగి విడుదల చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఆదరణ పొందాయి.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే పలు సినిమాలు తిరిగి విడుదలై మరోసారి ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో నిరూపించుకున్నాయి.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా ఎంతో పేరు సంపాదించుకున్న రవితేజ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిరపకాయ్.ఈ సినిమా రవితేజ సినీ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.ఈ క్రమంలోనే ఈ సినిమాని రవితేజ పుట్టినరోజు సందర్భంగా తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జనవరి 26వ తేదీ రవితేజ పుట్టినరోజు కావడంతో ఇదే రోజున థియేటర్లో మిరపకాయ్ సినిమాని4kలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఇక ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.త్రినాథ్ రావు దర్శకత్వంలో రవితేజ శ్రీ లీల నటించిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంకా ఇప్పటికి ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ రన్ అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.







