మా ఇద్దరి మధ్య అలాంటి బాండింగ్ ఉంది... శృతిహాసన్ తో రిలేషన్ పై గోపీచంద్ క్లారిటీ!

చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో గుర్తింపు పొందిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి సుపరిచితమే తాజాగా ఈయన శృతిహాసన్ బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వేదికపై శృతిహాసన్ కు ఐలవ్యూ చెప్పడం పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

 There Is Such Bonding Between Us Gopichand Clarity On Shruti Haasans Love Affai-TeluguStop.com

అయితే ఈయన ఏ ఉద్దేశ్యంతో తనకు ఐ లవ్ యు చెప్పారనే విషయం శృతిహాసన్ చెప్పినప్పటికీ వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేశారు.

ఇక సోషల్ మీడియాలో ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే తాను రిజెక్ట్ చేసిన విధంగా వీరిద్దరి గురించి మీమ్స్ క్రియేట్ చేస్తూ ఓ రేంజ్ లో వైరల్ చేశారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ గోపీచంద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తనకు శృతిహాసన్ తో ఉన్నటువంటి రిలేషన్ గురించి బయట పెట్టారు.తాను శృతిహాసన్ తో కలిసి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని గోపీచంద్ తెలిపారు.

శృతిహాసన్ హీరోయిన్ గా బలుపు, క్రాక్ , వీరసింహారెడ్డి సినిమాలు చేశానని, ఆమెతో నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉందని గోపీచంద్ వెల్లడించారు.అదే విషయాన్ని వేదికపై తనకు చెప్పడంతో సోషల్ మీడియాలో మా ఇద్దరి మధ్య ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే లవ్ గా మార్చి వైరల్ చేశారని అయితే మా ఇద్దరి రిలేషన్ గురించి వచ్చినటువంటి ఫన్నీ మీమ్స్ చూసి ఇద్దరం తెగ నవ్వుకున్నామని ఈ సందర్భంగా గోపిచంద్ శృతిహాసన్ తో వచ్చినటువంటి లవ్ ఎఫైర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube