షారుఖ్ వాచ్ ఖరీదు తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజెన్స్.. ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ వాచ్ అమ్మితే రౌడీ బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోతారు.మరి సినిమాలో చూపించిన మాదిరిగానే ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వాచ్ అమ్మితే కూడా ఏకంగా ఒక కుటుంబం కాదు.

 Netizens Are Surprised To Know The Cost Of Srk's Expensive Watch, Shah Rukh Khan-TeluguStop.com

పదుల సంఖ్యలో కుటుంబాలు బ్రతకవచ్చు.మరి ఇంతకీ ఈ స్టార్ హీరో పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే కాలంలో సెలెబ్రిటీలు ఏ వస్తువు వేర్ చేసిన కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.ఇలాంటి విషయాలపై ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.వారు ఏ షర్ట్ వేసుకున్నారో అది ఎంత రేటు.ఇంకా ఏ బ్రాండ్ వస్తువులను వాడుతున్నారో నిముషాల్లోనే ఆన్ లైన్ సెర్చ్ చేసి వాటి ధరను యిట్టె తెలుసుకుంటున్నారు.

ఇక తాజాగా షారుఖ్ ఖాన్ పెట్టుకున్న వాచ్ గురించి చర్చ జరుగుతుంది.ఆయన ధరించిన వాచ్ ఖరీదు నాలుగు కోట్ల 75 లక్షలు అంటూ ఒక ట్విట్టర్ యూజర్ చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.షారుఖ్ ఖాన్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేయగా ఆ ఫొటోలో ఈయన చేతికి పెట్టుకున్న వాచ్ గురించి చర్చ స్టార్ట్ అయ్యింది.

బ్లు సిరామిక్ ఏపీ పర్మనెంట్ క్యాలెండర్ వాచ్ ను ధరించిన షారుఖ్ ఈ ఫోటోను షేర్ చేసాడు.ఈ వాచ్ 4.75 కోట్లు అని తెలుస్తుంది.ఇది గత ఏడాది ఆగస్టులో విడుదల అయిన లగ్జరీ వాచెస్ లో ఒకటి.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ లలో ఇది ఒకటి.ఈ వాచ్ లో పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు లపై 18 క్యారెట్ల బంగారం తాపడం చేసి ఉంది.ఈ వాచ్ చూసిన వారంతా ఇంత లగ్జరీ వాచ్ పెట్టుకున్న షారుఖ్ గురించి మాట్లాడు కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube