సంక్రాంతి @600 కోట్లు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బిజినెస్!

మన సౌత్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అంటే ఎప్పుడు పండుగ అనే చెప్పాలి.ఇది మనకు పెద్ద పండుగ కావడంతో ఈ సీజన్ లో సినిమాలు కూడా ఎక్కువుగా రిలీజ్ అవుతూ ఉంటాయి.

 Sankranthi 2023 Movies Total Collections , Sankranthi Movies Collections, Ajith-TeluguStop.com

సంక్రాంతి పండుగ కానుకగా ఎప్పటి లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.ఈసారి స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి.

ఈ సంక్రాంతి సీజన్ లో కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచి పోయేలా కలెక్షన్స్ సాధిస్తాయి.2023 సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి.ఇందులో రెండు తమిళ్ సినిమాలు కాగా.రెండు తెలుగు సినిమాలు.నాలుగు కూడా స్టార్ హీరోల సినిమాలు కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

తమిళ్ హీరోల సినిమాలు విజయ్ వారిసు, అజిత్ తునివు జనవరి 11న రిలీజ్ అవ్వగా.బాలయ్య నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న రిలీజ్ అయ్యింది.ఇక మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాల్లో లేటుగా వచ్చిన కూడా వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాకు 144 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

అలాగే వీరసింహారెడ్డికి 109 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.విజయ్ వారిసు తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాగా 213 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.ఇక తునివు కూడా 150 కోట్ల గ్రాస్ అందుకుంది.ఇలా నాలుగు సినిమా 616 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నాయి.మరి సౌత్ లో ఎప్పుడు లేని స్థాయిలో సంక్రాంతి బిజినెస్ జరిగింది.ఇక ఈ సినిమాలు లాంగ్ రన్ ముగిసే సమయానికి ఏ విధంగా కలెక్షన్స్ అందుకుంటాయో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube