ఈ రోజు మీకు ఒక కథ చెప్తాను … కథ పూర్తిగా చదివితేనె మీకు అసలు విషయం అర్ధం అవుతుంది.కథలోకి వెళ్తే తమిళ నాడు లోని తిరునల్ వేలి లో 1970 లలో జరిగిన సంఘటన.
అక్కడ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి .ఉద్యోగమ్ చేస్తూ ఉండే వాడు.ఒక్క రూపాయి ఎక్కువ వస్తుంది అని నైట్ షిఫ్ట్ కూడా చేసే వాడు.కానీ రాత్రిళ్ళు భార్యను ఇంట్లో ఒంటరిగా ఉంచి ఉద్యోగానికి వెళ్లడం ఇష్టం లేక ఆ ఊర్లోనే ఉన్న తన మిత్రుడిని కాపలాగా పెట్టి వెళ్లేవాడట.
ఎందుకంటే యాభై ఏళ్ళ క్రితం మనుషులను అంత గా నమ్మే రోజులు అవి.ఇరుగు పొరుగు అంటే చేదోడు వాదోడుగా ఉండాలనుకునే వారు.పైగా పల్లెటూరు కాబట్టి ఒకరంటే ఒకరికి బాగా విశ్వాసం కూడా ఉండేది.
కానీ ఒక రోజు అనుకోకుండా ఉద్యోగానికి వెళ్లి గంట లోనే వెనక్కి వచ్చాడట.ఇంటికి వచ్చి చూసే సరికి తన మిత్రుడితో భార్యను చూడకూడని స్థితిలో చూసాడు.అది తట్టుకోలేక అక్కడే స్నేహితుడిని భార్యను చంపేశాడు.
ఆ సంఘటన అతడిని పిచ్చి వాడిని చేసింది.ఆ తర్వాత రాత్రికి రాత్రే ఊరి నుంచి బాంబే కి పారి పోయాడు.
కానీ అప్పటి నుంచి ఆడవారి పై విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు.ముంబై యువతులను టార్గెట్ చేసుకొని ట్రాప్ చేసి చంపెయ్యడం మొదలు పెట్టారు.
ఆలా 12 మంది యువతులను చంపాడు సదరు వ్యక్తి.అతడిని పోలీస్ వారు సీరియల్ కిల్లర్ గా గుర్తించి అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
అప్పుడు ఆ వ్యక్తి తాను ఎందుకు ఆ యువతులను టార్గెట్ చేసి చంపినా విషయం పోలీసులతో చెప్పాడు.
అది అప్పట్లో మీడియాలో బాగా వైరల్ అయ్యింది.వార్త పత్రికల్లో ఈ సంఘటన అంత కూడా ప్రచురితం అయ్యింది.పోలీస్ శాఖ కూడా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి సదరు హంతకుడికి మతిస్థిమితం లేదు అని నిర్ధారించారు.
పేపర్ లో వచ్చిన ఆ హంతకుడి పేరు రామన్ రాఘవన్.ఈ వ్యక్తి కథను ఆధారం చేసుకొని దర్శకుడు భారతి రాజా ఒక తమిళ లో ఒక సినిమా తీశారు.
ఆ సైకోపాతిక్ సీరియల్ కిల్లర్ చిత్రం పేరు సివప్పు రోజాక్కళ్.ఈ సినిమాను తెలుగు లో ఎర్ర గులాబీలు పేరు రీమేక్ చేసారు.