యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వివాదాలకు దూరంగా ఉన్నా కొంతమంది మాత్రం ఆయనను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.తాజాగా తారక్ అమెరికా యాక్సెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే.
ఆ ట్రోల్స్ గురించి తారక్ స్పందిస్తూ యాస, కాలమానం ఆధారంగా మన మధ్య తేడాలు ఉండవచ్చని అయితే పశ్చిమ దేశాల్లో ఒక నటుడు ఎలాంటి విధానాన్ని అవలంభిస్తాడో తూర్పు దేశాలలో కూడా అదే విధంగా ఉంటుందని తారక్ కామెంట్లు చేశారు.
ప్రాంతాన్ని బట్టి మాటతీరులో తేడా ఉంటుందని తారక్ చెప్పడం గమనార్హం.
జక్కన్న గురించి తారక్ మాట్లాడుతూ రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ అని అన్నారు.రాజమౌళి తన సినిమాలతో ప్రపంచం మొత్తాన్ని అలరించిన వ్యక్తి అని తారక్ కామెంట్లు చేశారు.
ప్రతి సినిమాతో రాజమౌళి తన స్థాయిని పెంచుకుంటున్నారని తారక్ చెప్పుకొచ్చారు.ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పశ్చిమ దేశాల్లో కూడా రాజమౌళి క్రేజ్ పెరిగిందని తారక్ తెలిపారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మాకు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందని తారక్ చెప్పుకొచ్చారు.ఆర్.ఆర్.ఆర్ గ్లోబల్ మూవీగా పేరు సంపాదించుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.మరోవైపు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ కొరటాల శివ రికార్డులు బ్రేక్ చేసే సినిమాను తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటున్నారు.250 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
త్వరలో తారక్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయని సమాచారం.