కాంతారా సినిమా విజయం సాధించినప్పటి నుంచి రష్మిక నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కన్నడ సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగానే వస్తుంది.అందుకే ఆమె కన్నడ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.
వాస్తవానికి ఒకానొక టైంలో ఆమెను పూర్తిగా బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చినా కూడా కేవలం ఆమెకు సుదీప్ కిచ్చ వంటి స్టార్ హీరోలతో ఉన్న మంచి సంబంధాల కారణంగా అలాంటి తీవ్ర నిర్ణయం అయితే తీసుకోలేదు.అయినా కూడా కన్నడ వారికి వారి సొంత భాష మీద ఈ మధ్య కురిపిస్తున్న విపరీతమైన ప్రేమ వల్ల రష్మికకు చేటు కాలం ఉందనే చెప్పాలి.

ఇక సంక్రాంతి విడుదలైన వారసుడు సినిమా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఏకంగా 300 షోలు రద్దు అయ్యాయి.దీనికి పూర్తిగా కారణం రష్మిక కాకపోయినా గాలి మాత్రం అటువైపే విస్తోంది.సినిమా కూడా టాక్ అంత బాగా ఏమీ లేదు కానీ ఫ్లాప్ కి మాత్రం రష్మిక కారణం అనే మాటలు వినిపిస్తున్నాయి.పైగా రష్మిక వ్యవహారంలో రిషబ్ శెట్టి ప్రవర్తన కూడా ఏమంత సబబుగా లేదు.
తింగరి పిల్ల రష్మిక ఏం మాట్లాడితే పోయిందేముంది.రిషబ్ శెట్టి కి ఆమె వాళ్ళ నష్టమైతే ఏమీ లేదు కదా.? పెద్దమనిషి తరహాలో రిషబ్ వ్యవహరిస్తే బాగుండేది.ఇంతటి వ్యతిరేకత ఆమెపై వచ్చేది కాదు.

ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.మన తెలుగులో లాగా ఏదైనా సమస్య ఉంటే ఇరువైపు వర్గాలను కూర్చోపెట్టి ఆ సమస్యను తెగ్గొట్టే పరిస్థితి కన్నడ ఇండస్ట్రీలో కనిపించడం లేదు.అలాంటి పెద్ద మనిషి తరహా వ్యవహారాలు కూడా అక్కడ జరగడం లేదు.అసలు వారసుడు సినిమాని కన్నడలో విడుదల చేయకూడదు అనుకున్నప్పటికీ బయ్యర్లకి, ఎగ్జిబిటర్స్ కి ఉన్న మంచి సంబంధాల కారణంగా మరియు సుదీప్ కిచ్చ రష్మికకు పరోక్షంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉండడం వల్ల ఈ సినిమా కర్ణాటకలో విడుదల అయింది.
ఇకనైనా సొంత ఊర్లో ఇంత వ్యతిరేకత సాధించుకున్న కారణంగా రష్మిక వెనక్కి చూసుకుంటుందా లేదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.







