కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ కారణంగా తమ భూమి ధర పడిపోయిందని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లికి చెందిన రైతు బాలకృష్ణ పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించాడు.మాస్టర్ ప్లాన్ గ్రీన్ జోన్ లో బాధిత రైతు భూమి ఉంది.గతంలో రూ.70 లక్షలు పలికిన భూమి ధర మాస్టర్ ప్లాన్ కారణంగా ప్రస్తుతం రూ.20 లక్షలకు పడిపోయింది.పిల్లల చదువు కోసం భూమి అమ్ముకోవాలనుకున్న బాధిత రైతు ధర పడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించారు.
దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కామారెడ్డి, జగిత్యాలలోని రైతులు కోరుతున్నారు.







